నర్సంపేట/చెన్నారావుపేట,మార్చి15: మెప్మా, ఐకేపీల్లో పనిచేస్తున్న వీవోఏలు, ఆర్పీల సమస్య లను పరిష్కరించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ బడ్జె ట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించి న పీఆర్సీ వర్తించట్లేదని చెబుతున్నారని అన్నారు. గ్రామాల్లోని మహిళలను గ్రూపులుగా సమన్వ యం చేయడంలో వీవోఏలు, ఆర్పీలు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారి ఉద్యోగ భద్ర తకు హామీ ఇవ్వాలని కోరారు. వారి నెలసరి జీత భత్యాల గూర్చి పెద్ద మనుసుతో పరిశీలించాల ని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరా రు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లా డుతూ వీవోఏలు, ఆర్పీల ఉద్యోగ భద్రత, వారి జీతభత్యాల గురించి తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
చెన్నారావుపేట-ఖానాపురం మండలం రంగా పురం గ్రామాల మధ్య పాకాలవాగు(మున్నేరు నది)పై బ్రిడ్జితో కూడిన చెక్‌డ్యాం నిర్మాణానికి అ నుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. చెన్నారావుపేట- ఖానాపురం మండలాల మధ్య మున్నేరునదిపై, చెన్నారావుపేట-నెక్కొండ మండ లాల మధ్య వట్టెవాగుపై ప్రతిపాదించిన వంతెన తో కూడిన చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రతిపాదన లు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ కలుగజేసుకొని అనుమతులు మంజూరు చేయాలని కోరారు. బ్రిడ్జి నిర్మాణంపై ఎమ్మెల్యే పెద్ది అసెంబ్లీలో ప్రస్తావించడంపై హె ల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు వేముల పల్లి రాజు, సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ సుదర్శ న్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ అను మతిని తీసుకొని టెండర్లు నిర్వహించి త్వరితగ తిన బ్రిడ్జి, చెక్‌డ్యాంల నిర్మాణ పనులు పూర్తిచేసే లా ఎమ్మెల్యే చొరవ చూపాలని రాజు కోరారు.
సెర్ప్, మెప్మాలో పనిచేస్తున్న వారికి ప్ర భుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనా లు ఇస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్ర కటించడంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేశా రు. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ మంత్రులు ఆర్థిక మంత్రితో కలిసి లెక్కలు తేల్చి అందరికీ న్యాయం చేస్తామనడం సంతోషమని వారు పేర్కొన్నారు.