వరంగల్‌చౌరస్తా, నవంబర్2 : వరద ముంపు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పా టు చేసి మెరుగైన సేవలందించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్, హనుమకొండ నగరాలలో జిల్లా వైద్యాధికారులు అప్పయ్య, సాంబశివరావులతో కలిసి ముంపు ప్రాంతాలైన సమ్మయ్య నగర్, అమరావతి కాలనీ, బృందావన కాలనీ, సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్ నగర్, రామన్నపేట, పోతన నగర్ ప్రాంతాలను పరిశీలించారు. వరద నీటి ప్రవాహానికి దో మల బెడద ఎక్కువవడం, పరిసరాలు తడిగా మారడం, నీరు, ఆహారం కలుషితం కావడం మూలంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున రానున్న వా రం రోజుల పాటు నిరంతర వైద్య సేవ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.
వరద బాధిత ప్రాంతాల్లో ఇంటిం టి సర్వే నిర్వహించి ఆరోగ్య సమస్యలు గుర్తించిన వెంటనే సంబందిత ప్రాంత ఆరోగ్య కేంద్రాలనికి సిఫారసు చేయాలని అన్నారు. అనంతరం వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కా ర్యాలయంలో వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. అవసరాన్ని బట్టి ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు, మున్సిపల్ శాఖ అధికారుల సమన్వయంతో దోమలు, లార్వా నివారణ, పారిశుద్య చర్య లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో మదన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రకాశ్, డాక్టర్లు కొమురయ్య, మోహన్‌సింగ్, విజయ్‌కుమార్, ఉదయ్‌రాజ్, నవీన్, జ్ఞానేశ్వర్, మంజు ల, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, ప్రోగ్రాం ఆఫీసర్ ఇక్తదార్ అహ్మద్, ఎంజీఎంహెచ్ వైద్యాధికారి డాక్టర్ అర్చన పాల్గొన్నారు.