బచ్చన్నపేట అక్టోబర్ 15 : తన పబ్బం గడపడం కోసం పదవి వ్యామోహంతో పూటకో పార్టీ మారే మాసాపేట రవీందర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంధమల్ల నరేందర్ అన్నాడు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే గొప్ప వ్యక్తి నిబద్ధత కలిగిన మహా నాయకుడన్నారు.
జనగామ ప్రజల కోసం తన సొంత హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందిస్తున్న నాయకుడిని పట్టుకొని ఎందుకు పనికిరాని మాసపేట రవీందర్ రెడ్డి అనే వ్యక్తి విమర్శించడం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికైనా రవీందర్ రెడ్డి తన పద్ధతి మార్చుకొని తక్షణమే ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలన్నారు. ముందుగా ప్రజలకు సేవ చేయడం నేర్చుకొని ఒకే పార్టీలో నిలకడగా ఉండడం నేర్చుకో అని హితవు పలికారు.