నర్సింహులపేట, మే 24 : మండల కేంద్రంలోని కపిలగిరి గుట్టపై వేంచేసిన శ్రీయోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లక్ష్మి నరసింహస్వామి చెంచులక్ష్మి, ఆదిలక్ష్మిల కళ్యాణం శుక్రవారం రాత్రి పున్నమి వెన్నల నడుమ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నరసింహస్వామి ధర్మకర్తల పాలమండలి, శ్రీ యోగనంద నరసింహస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.
బుధవారం (బండ్లు తిరుగుట) కార్యక్రమం ఉండటంతో దేవస్థానం వద్ద విద్యుత్, మంచినీటి, వైద్య సౌకర్యం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దేవస్థానం వద్ద ఎస్ఐ సురేశ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీయోగనంద లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.