కరీమాబాద్ ఏప్రిల్ 7 : బీఆర్ఎస్ పార్టీ గత 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల ఆశయాలకు అంకితమై పని చేస్తోందని, పార్టీ సాధించిన విజయాలు ప్రతి కార్యకర్త గర్వపడేలా ఉన్నాయని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాబోయే రజతోత్సవ మహాసభలను పురస్కరించుకొని 41వ డివిజన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. రాబోయే రజతోత్సవ మహాసభలు ప్రతిఒక్క కార్యకర్తకు పండుగలా మారాలన్నారు. ఎల్కతుర్తిలో జరిగే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తుమ్మలపల్లి రమేష్, ముఖ్య నాయకులు మహమ్మద్ అలీ, యాకూబ్ పాషా, బజ్జీలు రవి, అఫ్రీన్, బొల్లం సంజీవ, కారు శ్రీపాల్, అశోక్ పాల్గొన్నారు.