కృష్ణకాలనీ, నవంబర్ 21 : పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాల చరిత్ర తెలుసుకోవచ్చని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. మైనార్టీ గురుకుల కళాశాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకులు సోమవారం ఘనంగా జరిగాయి.. ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. జిల్లాలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన కునూరి నరేశ్ పట్టుదలతో చదివి సివిల్స్‌లో 150వ ర్యాంకు సాధించాడని ఇది జిల్లాకే గర్వకారణమన్నారు. ఆయను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని మంచి ర్యాంకులు సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాల్లోని గ్రంథాలయాలకు వసతులు కల్పించి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. సింగరేణి సహకారంతో ఆధునిక వసతులతో జిల్లా గ్రంథాలయం నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
విజేతలకు బహుమతులు అందించిన జీఎంఆర్ఎం ట్రస్ట్
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్ర లేఖనం, పాటలు, ముగ్గులు, మ్యూజికల్ చైర్, ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీఎంఆర్ఎం ట్రస్ట్ 100 బహుమతులను బహూకరించింది. కలెక్టర్ భవేశ్‌మిశ్రా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
చిత్రలేఖనంలో ప్రథమ బహుమతి డీ కారుణ్య, ద్వితీయ బహుమతి ఎస్కే ఇర్ఫాన్, తృతీయ బహుమతి ఏ కేశవులు, మ్యూజికల్ చైర్ బాలికల విభాగంలో పథమ జే సహస్ర, ద్వితీయ శాన్వీ, తృతీయ బీ వైష్ణవి, బాలుర విభాగంలో ప్రథమ సీహెచ్ విక్రమ్, ద్వితీయ షోయబ్ ఖాన్, తృతీయ ఎస్కే అంకూస్, వ్యారచన పోటీల్లో జూనియర్ విభాగంలో ప్రథమ రిషిత, ద్వితీయ శిశ్వసాధన, తృతీయ అబ్దుల్లా, సీనియర్స్ విభాగంలో ప్రథమ అఫ్రోజ్, ద్వితీయ సాయి, తృతీయ లక్ష్మి, వకృత్వ పోటీల్లో జూనియర్స్ విభాగంలో ప్రథమ జోషిత్, ద్వితీయ సంజన, తృతీయ నక్షత్ర, సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి వినోద్ కుమార్, ద్వితీయ బహుమతి సాయి, తృతీయ బహుమతి కీర్తన గెలుపొందారు.
అలాగే పాటల పోటీల్లో జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి యోచిత, ద్వితీయ లావణ్య, తృతీయ యశ్వంత్, సీనియర్స్ విభాగంలో ప్రథమ నవీన్, ద్వితీయ సాయి, తృతీయ స్వాతి, ముగ్గుల పోటీల్లో జూనియర్స్ విభాగంలో ప్రథమ హనీ, ద్వితీయ జస్విత, తృతీయ నాగేశ్వరి, సీనియర్స్ విభాగంలో ప్రథమ లక్ష్మి, ద్వితీయ సాయి తేజస్వి, తృతీయ కృష్ణవేణి, క్విజ్ పోటీల్లో ప్రథమ బహుమతి భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల టీం, ద్వితీయ ఎస్ఆర్ డీజీ పాఠశాల భూపాలపల్లి, తృతీయ బహుమతి టీఎమ్‌ఆర్ భూపాలపల్లి గెలుపొందారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీసిద్ధు, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం బళ్లారి శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గండ్ర హరీశ్‌రెడ్డి, కౌన్సిలర్లు శిరుప అనిల్, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్‌రెడ్డి, గ్రంథాలయ కార్యదర్శి టీ శ్రీలత, కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, కమల, రాజ్ మహ్మద్, గ్రంథాలయ డైరెక్టర్లు ఐలయ్య, రాయమల్లు, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, సిబ్బంది చంద్రమౌళి, శారద, శ్రీనివాస్, శైలజ, భాగ్యరాణి, రాణి, ప్రభాకర్, మురళి, అధ్యాపకులు నూనె సుధాకర్, శేఖర్ పాల్గొన్నారు.