ములుగు: ములుగు (Mulugu) జిల్లా వెంకటాపురం మండలం ఇప్పలగూడెంలో దారుణం చోటుచేసుకున్నది. తాగిన మైకంలో మేనత్తను గొడ్డలితో నరికేశాడు. ఇప్పలగూడానికి చెందిన కొండగొర్ల ఎల్లమ్మ (50)కు కొండగొర్ల విజయ్ కుమార్ వరుసకు మేనళ్లుడు అవుతాడు. జల్సాలు, మద్యానికి బానిసైన విజయ్ కుమార్ డబ్బులు ఇవ్వాలని మేనత్తను అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆమెను నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం గొడ్డలితో సహా పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదుచేసిన పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.