గోవిందరావుపేట : పర్యాటక ప్రాంతమైన లక్నవరంలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలువు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి ప్రకృతి అందాలను చూసి జోష్‌లో మునిగి తేలారు. వెలాడే వంతనపై నడుస్తూ బోటింగ్ పాయింట్‌కు చేరుకున్నారు. అనంతరం సరస్సులో బోటు షికారు చేస్తూ ఫిదా అయ్యారు. పర్యాటకుల రాక సందర్భంగా లక్నవరం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.