Mulugu : ములుగు జిల్లా ఏటూరు నాగారం సర్పంచ్‌గా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు (Kakulamarri Narsimha Rao) సతీమణి భారీ మెజార్టీతో గెలుపొందారు. తొలి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కాకులమర్రి శ్రీలత (Kakulamarri Srilatha) 3,230 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు.