హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30 : కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్(Arts College) కాలేజీలో బీఎస్సీ చదువుతున్న కోడి లహరి ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్ దుండిగల్ ప్రాంతంలోని ఎంఎల్ఆర్ సాంకేతిక విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్(NSS) జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంగళవారం కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి విద్యార్థినికి సర్టిఫికెట్ను అందజేసి అభినందనలు తెలిపారు. జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ శిబిరంలో పాల్గొనడం కాలేజీకే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కాలేజీ సహాయక రిజిస్టర్ శ్రీలత, ఎన్ఎస్ఎస్ అధికారులు శ్రీదేవి, చందర్, రమేష్ పాల్గొన్నారు.