ఏటూరు నాగారం : మండల కేంద్రంలో శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ విద్యార్థి దశ నుంచి మరణించే వరకు పరితపించిన మహానేత అని కొనియాడారు.
ఆయన కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. జయశంకర్ సార్ లాంటి మహనీయులు దేశంలో అరుదుగా ఉంటారని, సృష్టి ఉన్నంత వరకు జయశంకర్ సార్ను ప్రజలు గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొనూరు అశోక్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, నూతి కృష్ణమూర్తి, ఖాజా పాషా, సప్పిడి రాంనర్సయ్య, జాడి బోజారావు, కుమ్మరి చంద్రబాబు, వావిలాల కిషోర్, బాస శరత్, వావిలాల ముత్తయ్య, కట్కూరి రాకి తదితరులు పాల్గొన్నారు.