గోవిందరావుపేట, మే 30: గోవిందరావుపేట (Govindaraopet) మండలంలో కురిసిన అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసుకున్న ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసిన్నప్పటికీ సాయంత్రం వేళల్లో కురుస్తున్న అకాల వర్షానికి ధాన్యం మళ్లీ తడిసిపోతున్నది. ఇలా రైతులు గత 20 రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. వరనుడు కరుణించినట్లయితే ధాన్యం ఎండి అమ్ముకునే పరిస్థితి వస్తుందని, లేనిపక్షంలో తమ ధాన్యం తడిసి ముద్దయ్యే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.