Veleru | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : సీఐ పూర్ణేశ్వర్
మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయని, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సీఐ పూర్ణేశ్వర్ సూచించారు.
వేలేరు : మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయని, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సీఐ పూర్ణేశ్వర్ సూచించారు. వేలేరు ఎస్ఐ అజ్మీర సురేశ్ ఆధ్వర్యంలో మంగళవారం మనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంతో పాటు, పీచర, మల్లికుదుర్ల, షోడశపల్లి గ్రామాల్లో డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ పూర్ణేశ్వర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు.
డ్రగ్స్ విక్రయం, వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు, క్రీడలు లాంటి మంచి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రగ్స్ సమస్యను అరికట్టడం, యువతలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

