ములుగు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇసుక లారీ గొర్ల మంది పైకి దూసుకెళ్లడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ పరిధి ఎర్రి గట్టమ్మ దేవాలయం సమీపంలోని జాతీయ రహదారి 163 వద్ద జరిగింది.
స్థానికుల కథనం మేరకు.. ఇసుకను తరలించేందుకు ములుగు వైపు నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఖాళీ ఇసుక లారీ అదుపుతప్పి గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల కాపరుల ఫిర్యాదు మేరకు ములుగు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.