సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలుగు రాష్ర్టాల్లో థియేట్రికల్ రిలీజ్ చేశారు. శనివారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సినిమా చూసి ప్రభాస్ అన్న తనను ప్రశంసించడంతో గెలిచాననే ఫీలింగ్ కలిగిందని హీరో సంతోష్ శోభన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభాస్ వంటి అగ్ర హీరో ఈ సినిమా బాగుందని మెచ్చుకోవడంతో టీమంతా హ్యాపీగా ఉన్నామని, ఈ సినిమా విజయంతో ఈ ఏడాది సక్సెస్‌ఫుల్‌గా మొదలైందని ధీరజ్ మొగిలినేని చెప్పారు. వాలెంటైన్స్ డేను ఈ సినిమాతో సెలబ్రేట్ చేసుకుంటున్నారని దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.