సత్తువనిచ్చే సాబుదానా
శివరాత్రి నాడు చాలామంది ఒక్కపొద్దు ఉంటారు. కొందరైతే పచ్చి గంగ ముట్టరు. పొద్దంతా నిలారం ఉండటం వల్ల... సాయంత్రానికి నిస్సత్తువ ఆవహస్తుంది.
శివరాత్రి నాడు చాలామంది ఒక్కపొద్దు ఉంటారు. కొందరైతే పచ్చి గంగ ముట్టరు. పొద్దంతా నిలారం ఉండటం వల్ల… సాయంత్రానికి నిస్సత్తువ ఆవహస్తుంది. ఉపవాస దీక్ష విరమణ తర్వాత కూడా ఆ నీరసం అలాగే కొనసాగుతుంది. అలా కావొద్దంటే.. తక్షణ శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. ఉపవాస దీక్ష నాడు సాబుదానతో చేసిన పదార్థాలకు పాక దోషం ఉండదని పెద్దల మాట. అందుకే, సగ్గుబియ్యంతో చేసే
కిచిడి, పాయసం ఎలా చేసుకోవాలో ఇక్కడ ఇస్తున్నాం. సాయంత్రానికి ఈ రెండు రెసిపీలు చేసుకొని.. ఉపవాసాన్ని కులాసాగా విరమించండి.
సాబుదానా కిచిడి
కావాల్సిన పదార్థాలు : సాబుదానా : ఒకటిన్నర కప్పు, పల్లీలు : అరకప్పు, పచ్చి బఠాణీలు : అరకప్పు,
పచ్చిమిర్చి : రెండు, నూనె : మూడు
టీస్పూన్లు, జీలకర్ర : అరటీస్పూన్, ఆవాలు : పావుటీస్పూన్, పసుపు : పావుటీస్పూన్, ఉప్పు : తగినంత,
నిమ్మరసం : ఒక టీస్పూన్, కొత్తిమీర
తురుము : కొద్దిగా, ఆలుగడ్డ : ఒకటి, నూనె : తగినంత
తయారీ విధానం: సాబుదానాని శుభ్రం చేసుకుని రాత్రే నీళ్లుపోసి నానబెట్టుకోవాలి. పల్లీలు వేయించుకుని మిక్సీలో పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆలూ ముక్కలని నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిబఠాణీలు వేసి మెత్తగా అయ్యేంతవరకూ మగ్గించుకోవాలి.
పచ్చిబఠాణీ బాగా మగ్గిన తర్వాత నానబెట్టిన సాబుదానా, ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలిపి చిన్నమంటమీద పదినిమిషాల పాటు ఉడికించాలి. సాబుదానాను ఎక్కువగా ఉడకనివ్వకూడదు. పొడిపొడిగా ఉండగానే దింపి వేయించిన పల్లీల పొడి, ఆలూ ముక్కలు వేసుకుని కలపాలి. చివరిగా నిమ్మరసం పిండుకోవాలి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

