హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ర్ట సాధన మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్కి 16వ సంస్మరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ ఏనుగులగడ్డలో ముదిరాజ్ సంఘం తరపున నివాళులుర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు అమరుడైన పోలీస్ కిష్టయ్యను వారు స్మరించుకున్నారు.
ముదిరాజ్ సంఘం సభ్యులు పులి విక్రమ్, గందపెల్లి సాంబయ్య, గోనెల సుధాకర్, గోనెల అంజయ్య, గోనెల సాగర్, చింతాకుల ప్రభాకర్, గోనెల విజేందర్, గోనెల దేవేందర్, గోనెల వీరప్రసాద్, గందపల్లి రవి, గందపల్లి రాజేష్, కక్కు పృథ్వీరాజ్, బలబోయిన ప్రతాప్, గుర్రాల కిషన్, గుర్రాలు గౌతమ్, గోనెల రాజు, బలబోయిన గణేష్, గోనెల సూరి, గోనెల శివాజీ , గోనెల జయశంకర్, నర్రా శివాజీ, గోనెల రాజేందర్, చెమ్మాల అశోక్, చెమ్మాల రాజేష్, చాట్ల రాజు, పులేంటి సతీష్, కంకణాల శ్రీకాంత్, రాకేష్ పాల్గొన్నారు.