హనుమకొండ, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వకుండా ముస్లింలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ నయీముద్దీన్ మండిపడ్డారు. హనుమకొండ అలంకార్ సమీపంలోని బీఆర్ఎస్ మైనార్టీ ఆఫీస్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మహిళలకు, ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు రూ.50 వేలు ఇస్తానని మోసం చేస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇమామ్ ముస్లింలకు ఐదు నుంచి 10 వేలు ఇస్తానని చెప్పారు.
అలాగే ప్రతి షాదీముబారక్తోపాటు తులం బంగారం ఇస్తానని చెప్పి మాట మార్చారన్నారు. ప్రతి మహిళకు రూ.2500 ఇస్తానని ముస్లింలకు ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయలేకపోతున్నారని విమర్శించారు. ఈసారి జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో మైనార్టీలందరం ఏకతాటిపై వచ్చి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుని ముస్లింల సత్తా చూపించాలని నయీమొద్దీన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సర్దార్ అలీ, మహ్మద్ ఇక్బాల్, రషీద్, మహ్మద్ సమ్దానీ, తస్లీమ్ ఖాన్ పాల్గొన్నారు.