జనగామ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాలో ఉరు ములు, మెరుపులతో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ గాలులతో కురిసి న వర్షం చేతికొచ్చిన వరి పంట, మామిడి తోటలకు కొంత నష్టం చేశాయి. రఘునాథపల్లి మండలం కోమాల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలగూ డెం, ఇబ్రహీంపూర్, పత్తేషాపురంలో స్వల్పంగా వడగండ్లు పడ్డాయి. జనగామ వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం రాశులను తేమ పేరుతో వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో చాలా మంది రైతులు యార్డులో ఆరబోసుకున్నారు.
అయితే సాయంత్రం వాతావరణంలో వచ్చి న మార్పులతో కొందరు టార్పాలిన్లు కప్పుకోగా, మిగిలిన రైతుల ధాన్యం స్వల్పంగా తడిసింది. లింగాలఘనపురం-నెల్లుట్ల, కొత్తపల్లి పీఆర్ రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవరుప్పుల మండలం రామరాజుపల్లిలో పిడుగుపాటుకు పాడి గేదె మృతి చెందింది. చినమడూరులో వడగండ్ల వాన కురిసి వరి చేన్లకు నష్టం వాటిల్లింది.