ఖిలావరంగల్: వరంగల్ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 25.3 మిల్లీమీటర్లుగా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. గీసుగొండ, ఖిలావరంగల్, వరంగల్ మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అలాగే వర్ధన్నపేట మండలంలో అత్యధికంగా 50.2 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.
నల్లబెల్లిలో 42.2 మిల్లీమీటర్లు, రాయపర్తిలో 36.0 మిల్లీమీటర్లు, దుగ్గొండిలో 35.4 మిల్లీమీటర్లు, చెన్నరావుపేటలో 26.2 మిల్లీమీటర్లు, ఖానాపూర్లో 24.4 మిల్లీమీటర్లు, పర్వతగిరిలో 23.0 మిల్లీమీటర్లు, నెక్కొండలో 19.4 మిల్లీమీటర్లు, నర్సంపేటలో 17.2 మిల్లీమీటర్లు, సంఘంలో 15.8 m వర్షాపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే జిల్లాలో రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దూర ప్రయాణాలు చేసేవాళ్లు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.