మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 23 : మానుకోట మున్సిపాలిటీ శివారు కాలనీల్లో నివసిస్తున్న పేదలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. సోమవారం మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. వార్డుల్లో చెత్త బండి తిరగకపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, వెంటనే వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, నూతన మున్సిపల్ భవనాన్ని ప్రారంభించాలని కౌన్సిలర్లు లేవనెత్తిన పలు అంశాలపై సమావేశం గరంగరంగా సాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి, సరిపడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసిందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి సారించాలన్నారు. సమావేశానికి అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి స్థానిక సమస్యలపై సుదీర్ఘ చర్చ జరుగుతున్నప్పుడు అడిషనల్ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలన్నారు. నూతన మున్సి పల్ చట్టం ప్రకారం అన్ని అధికారాలు ఆయనకే ఉన్నాయని, కౌన్సిలర్ల సమస్యపై ఆయన పట్టింపు లేకుండా ఉంటే ఎట్లా అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, కమిషనర్ రవీందర్, డీఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణంలో అరకొర వసతులతో మెడికల్ కాలేజీ నిర్మించి విద్యార్థుల ను ఇబ్బందులకు గురి చేసిందని, వారి హయాంలో ప్రజలు కష్టాలు పడ్డారని ఎమ్మెల్యే మాట్లాడుతున్న క్రమంలో ఎమ్మెల్సీ రవీందర్రావు జోక్యం చేసుకుని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్ర భుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిందని, అన్ని రకాల వసతులను సమకూర్చాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. సంవత్సరం కాలం గడిచినా ఒక్క రూ పాయి రాలేదని, అభివృద్ధి ఎలా జరుగుతదని, కాలనీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విశాలమైన రోడ్లు, ఇంటింటికి నల్లా, ఉచిత విద్యుత్‌ను ఇచ్చిందని చెప్పారు.