మహబూబాబాద్ (నమస్తే తెలంగాణ), జూన్ 12 : అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కి మూడేళ్లు కావొస్తున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. నిరుద్యోగ యువతను నిలువునా ముంచిన కాంగ్రెస్ పార్టీకి యువత బుద్ధి చెప్పాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువత కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి రూ పొందించిన ‘రాకేశ్‌రెడ్డి ఈ క్లాస్’ ఉచిత యాప్‌ను శుక్రవారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్తి గార్డెన్లో వారు మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం సత్యవతి, ఎమ్మెల్సీ తకళ్లపల్లి మాట్లాడుతూ.. ఒక పోలీస్ శాఖలోనే 19 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే డీజీపీ సీవీ ఆనంద్ మా త్రం కేవలం 5 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో 15 వేల పోస్టులు ఖా ళీగా ఉన్నా ప్రభుత్వం కొన్ని పోస్టులే భర్తీ చేస్తామనడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉద్యోగుల రిజర్వేషన్ల విషయంలోనూ కాం గ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరి అవలంబిస్తున్నదని, తద్వారా ప్రతి భ కలిగిన విద్యార్థులతోపాటు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు అవకాశాలు కోల్పోతున్నారన్నారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను కార్యకర్తల్లా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ, నేడు వారిని విస్మరించిందన్నారు. కాంగ్రెస్ గాలి మాటలు నమ్మి మోసపోయిన యువత, గత బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాం లో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని రెండేళ్లకోసారి వివిధ శాఖల్లో లక్షా 67వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తే యువతకు ఉ ద్యోగాలు లభించే అవకాశమున్నా సర్కారు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల ఉద్యోగాలు పోతేనే ఉద్యోగాలు వస్తాయనే మాట గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. రాష్ట్ర జనాభా 4 కోట్లు ఉంటే, ఉద్యోగుల సంఖ్య 4 లక్షలేనని, యువత వైపు కూడా దృష్టి సారించాలన్నారు.
నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. పేద కుటుంబాల్లోని నిరుద్యోగులు పోటీ పరీక్షల సమయంలో స్టడీ మెటీరియల్ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రు లు భూములు అమ్మి డబ్బులు పంపేవారని తెలిపారు. అలాంటి వారి ఇబ్బందులు తొలగించాలనే లక్ష్యంతో ‘ఈ క్లాస్ యాప్’ రూపొందించి, ఉచితంగా అందించడం మంచి పరిణామమని తెలిపారు. దేశంలో అ త్యంత స్వల్ప కాలంలో ఇంత తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, రేవంత్‌రెడ్డి మెడలు వంచి నో టిఫికేషన్లు సాధించే వరకు మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బిందు, మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అనిల్, డీఎస్ఐఎఫ్ జాతీయ కన్వీనర్ డాక్టర్ వివేక్, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు భీమానాయక్, బానోత్ రవినాయక్ , విద్యాసాగర్, బాలూనాయక్ పాల్గొన్నారు.