మహబూబాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): కుకలు, కోతులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు కోరారు. బుధవారం శాసనమండలిలో ఆయన ప్రసంగించారు. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల ఒక ఆర్పీ, మరిపెడలో ఒక కౌన్సిలర్ కుకకాటుకు గురై ఆ తర్వాత అనారోగ్యంతో మృతిచెందారని ఆయన గుర్తుచేశారు.
కోతులను నియంత్రించేందుకు కుకలను పెంచితే అవి రెండూ కలిసిపోయి ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయని వివరించారు. అలాగే వాటి బెడదతో రైతులు వేరుశనగ, కూరగాయలు, పండ్ల తోటలు వేయడం మానేశారని పేర్కొన్నారు. రోడ్డు మీద ప్రజలు నడవాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుకలు, కోతులను నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సభ దృష్టికి తీసుకెళ్లారు.