మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్5 : అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని.. వెంటనే వారికి పరిహారం అందించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. వర్షాలతో అతలాకుతలమైన అయోధ్య గ్రామాన్ని గురువారం స్థాని క బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన సం దర్శించారు.
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారీ వర్షాల వల్ల అనేక చోట్ల చెరువు లు, కుంటలు తెగి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ వేదన వ్యక్తంచేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికే మహబూబాబా ద్ మండలంలో 87 చెరువులు, కుంటలు తె గినట్లు సమాచారం ఉందని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంక న్న, నాయిని రంజిత్ కుమార్, రవికుమార్, మంగళంపల్లి కన్న, తేళ్ల శ్రీను ఉన్నారు.