న్యూ శాయంపేట, నవంబర్ 13: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరు, పాలకుల పనితీరును బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు రాకేష్ యాదవ్ స్టేటస్ పెట్టుకుని ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమని మాజీ స్పీకర్, మండలి ప్రతిపక్షనేత మధు సూదనాచారి, హనుమకొండ మాఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడు గండ్రకోట రాకేష్ యాదవ్‌ను గురువారం న్యూ శాయంపేటలోని ఆయన స్వగృహంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ రాకేష్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్వీ, గులాబీ శ్రేణులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటుమన్నారు. ప్రశ్నించే పౌర సమాజం, యువత పై అక్రమ కేసులు నమోదు చేయడం, పోలీసులతో కొట్టించడం ఏంటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ నాయకులు జానకి రాములు, తదితరులు పాల్గొన్నారు