ఖిలా వరంగల్ : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించి, ఆయన ఆశయాలను తుంగలో తొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. శుక్రవారం ముప్పాల గుట్టలోని ఫంక్షన్ హాలులో అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా బిజెపి ఆధ్వర్యంలో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ సమాజంలో సమన్యాయం, సమాన హక్కులు అందరికి చెందాలనే ఆలోచనతో రాజ్యాంగాన్ని రాశారన్నారు.
ప్రతి వర్గానికి ప్రతి వ్యక్తికి సమాన హక్కులు వచ్చేవరకు పోరాడడమే అంబేద్కర్ ఆశయమని అన్నారు. అంబేద్కర్ అంటే జయంతికి వర్ధంతికి దండలు వేయడం కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయ రామారావు, జిల్లా బిజెపి అధ్యక్షుడు గంట రవికుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలేపాక మార్టిన్ లూథర్, ఎస్సీ మోర్చా జిల్లా ఇన్చార్జి రామిండ్ల బాబురావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం మహేందర్, బిజెపి సీనియర్ నాయకులు జన్ను ఆరోగ్యం, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మాదాసు రాజు, టి అంబేద్కర్, వర్ధన్నపేట వార్డు కౌన్సిలర్ కొండేటి అనిత పాల్గొన్నారు.