స్టేషన్ ఘన్పూర్, జూన్ 8: మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలను నింపి రైతుల జీవితాలను మార్చిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పాంనూర్ గ్రామంలో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సాగునీరు, తాగునీరు సమస్య ఉండవద్దనే లక్ష్యంతో వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు అనేక ప్రణాళికలతో సీఎం కేసీఆర్ ముందుకెళ్లారన్నారు. మిషన్ కాకతీయ పథకానికి ప్రత్యేక నిధులు కేటాయించి చెరువులు, కుంటలను మరమ్మతు చేశారన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎత్తైన ప్రదేశాలకు సాగు నీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.104 కోట్లు మంజూరు చేశారన్నారు. దీంతో నియోజకవర్గంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.
చెరువులు, కుంటలను అభివృద్ధి చేయడంతో ఇటు రైతులకు, అటు మత్స్య కార్మికులకు ఉపాధి లభిస్తోందన్నారు. అలాగే, మండలంలోని రాఘవాపూర్‌లో జరిగిన పెద్దమ్మతల్లి ఉత్సవాలకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.29 కోట్లతో నిర్మిస్తున్న గండిరామారం కుడికాలువ పనులు పూర్తయితే రాఘవాపూర్తోపాటు పలు గ్రామాలకు సాగునీటి సమస్య తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే చెరువులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. కేసీఆర్‌ను మళ్లీ దీవించాలని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కోతి రేణుకా రాములు, కందుల శ్రీలతా శ్రీనివాస్, ఎంపీటీసీలు ఇనుగాల రజితా రాజిరెడ్డి, బూర్ల లతాశంకర్, పురమాని రజాక్ యాదవ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న, ఇనుగాల సంపత్‌రెడ్డి, బత్తిని అశోక్ గౌడ్, పొన్న బీరయ్య, వంగ సారంగపాణి పాల్గొన్నారు.
రాజవరం, చిన్నపెండ్యాలలో..
చిల్పూరు : మండలంలోని రాజవరం, చిన్నపెండ్యాల చెరువుల పండుగలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు నీలా గట్టయ్య అధ్యక్షతన తెప్పల పోటీలు నిర్వహించగా ఎమ్మెల్సీ వాటిని ప్రారంభించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో రాజవరం రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం పోటీల్లో గెలుపుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, సర్పంచ్ మారెపల్లి తిరుమల కృష్ణామోహన్‌రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీ మారెపల్లి లలితాదేవి శ్యామ్‌కుమార్‌రెడ్డి, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.