సంగెం/నర్సంపేటరూరల్, జూలై 19: రుణమాఫీతో రైతు కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సంగెం మండలంలో జరిగిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వంజరపల్లిలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కా ర్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజ య్య, కాంగ్రెస్ మండల అధ్యక్షు డు మాధవరెడ్డి, పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి జనగాం రమేశ్, నాయకులు ఎం.రమేశ్, ఏపీఆర్, సంపత్‌రెడ్డి, నరహరి పాల్గొన్నారు. రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ నర్సంపేట పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, పాలకవర్గ సభ్యు లు, నాయకులు పాల్గొన్నారు.