హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7: అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని కొత్తూర్ బ్రిడ్జి వద్ద చేపల మార్కెట్ వద్ద సుమారు 25 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ తానాజీ, స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దశల వారీగా అన్ని డివిజన్స్లో సైడ్ డ్రైన్, సీసీ రోడ్ల పనులను చేస్తున్నామని, రోడ్డు నిర్మాణ పనుల్లో స్థానిక కాలనీ వాసులు ప్రభుత్వానికి సహరించాలని కోరారు. కాలనీలలో ఎటువంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి, కోడెపాక గణేష్, సురేష్ బాబు, ముప్పిడి శ్రవణ్, రాజేశ్వరి, అనిత, గుత్తికొండ సురేందర్, శ్రీకాంత్, స్వప్న, మోహన్ పాల్గొన్నారు.