నర్సంపేటరూరల్, నవంబర్ 15: గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్ అని, అలాంటి పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి, మాదన్నపేట, భోజ్యానాయక్‌తండా, భాంజీపేట, చంద్రయ్యపల్లి, రాజేశ్వర్రావుపల్లి, దాసరిపల్లి, కమ్మపల్లి, పర్శనాయక్‌తండా, రాజపల్లి, ముగ్దుంపురంలో బుధవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రెండో విడుత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రచార కార్యక్రమాలు.. సాయంత్రం వరకూ జోరుగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో, పురుషులు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ మారుమూల తండాలు, గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకొచ్చి రైతాంగం పాదాలు కడినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. తన గెలుపు ఖాయమైందని, ఇక మిగిలింది మెజార్టీయేనని తెలిపారు. మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్ కోసం సీఎం కేసీఆర్ రూ. 7.50 కోట్ల నిధులు అందించారని, స్వతహాగా కాంట్రాక్టర్ అయిన మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అప్పట్లో టెండర్లు వేయగా..
నిధులు స్వాహా చేసిన కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో ఎక్కడికక్కడే నిలదీయాలని కోరారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఐదేళ్లకోసారి టూరిస్టుల్లా వచ్చే నాయకులను నిలదీయాలని కోరారు. నిత్యం ప్రజల మధ్య ఉంటున్న తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా వీరన్న, క్లస్టర్ ఇన్చార్జీలు మచ్చిక నర్సయ్యగౌడ్, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, కడారి కుమారస్వామి, తాళ్లపల్లి రాంప్రసాద్, కట్ల సుదర్శన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు మొలుగూరి చంద్రమౌళి, భూక్యా లలిత, గాంధీ, బరిగెల లావణ్య, బొజ్జ యువరాజ్, వల్గుబెల్లి రంగారెడ్డి, నామాల భాగ్యమ్మ, పెండ్యాల జ్యోతి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ, ఊడ్గుల రాంబాబు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండలంలోని చంద్రయ్యపల్లి, నాగుర్లపల్లి, భోజ్యానాయక్తండాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సుమారు 25 మందికి పెద్ది గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి ఆశీర్వదిస్తే.. నర్సంపేట డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, చంద్రయ్యపల్లి సర్పంచ్ బరిగెల లావణ్య-కిశోర్‌కుమార్, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జర్పుల వీరన్న, నాయకులు పెద్ది తిరుపతిరెడ్డి, రాచర్ల నాగరాజు, వార్డు సభ్యులు రాజు, బయ్య నవీన్, కార్యదర్శి ఐలయ్య, సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.