నర్సంపేటరూరల్/ఖానాపురం, ఏప్రిల్ 12: రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని గురిజాలలో బుధవారం ఆయన ఉత్తర యుద్ధం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు సృష్టించడం, నల్లచట్టాలు తీసుకొచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేయడం వంటి వింతచేష్టలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. దేశ సంపదను మోదీ సర్కారు బడా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్‌గౌడ్, సర్పంచ్‌లు గొడిశాల మమత, తుత్తూరు కోమల, గడ్డం సుజాత, ఎంపీటీసీ బండారు శ్రీలత, నాయకులు మోటూరి రవి, అల్లి రవి, గొడిశాల సదానందం, బండారి రమేశ్, అల్లి రాజ్‌కుమార్, నర్సింగం, రాజు, రవి, శ్రీలత పాల్గొన్నారు. అలాగే, మండలంలోని రామవరంలో రైతులు, కూలీలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పార్టీలకతీతంగా ఉత్తర యుద్ధం కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, ఉప సర్పంచ్ జినుకల విమల-శంకర్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జినుకల విజేందర్, ఆరెపల్లి రాజేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో రైతులు, కూలీలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పెద్ది ఉత్తర యుద్ధాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్ గొర్రె కవిత, రవి, బండి వెంకన్న, సంపత్, యాదగిరిరావు పాల్గొన్నారు.
కేంద్రం దిగొచ్చే దాకా ఉద్యమం
దుగ్గొండి: కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేసే వరకూ ఉద్యమం ఆగదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. మండలంలోని నాచినపల్లిలో పెద్ది ఉత్తర యుద్ధాన్ని ప్రారంభించారు. ఉపాధి కూలీలు, రైతులతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఉత్తర యుద్ధం సందేశం అందేలా కార్డులను పోస్ట్ చేశారు. ఉపాధి కూలీల కడుపు కొట్టేలా ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీకి బుద్ధి చెప్పేలా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, నాచినపల్లి ఎంపీటీసీ నగనబోయిన మమతా మోహన్, ఉపసర్పంచ్ జంగా రాజరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బొమ్మినేని శ్రీనివాస్‌రెడ్డి, గుడిపెల్లి ధర్మారెడ్డి, నల్లా శ్యామ్‌సుందర్‌రెడ్డి, చెప్పాల రాజిరెడ్డి పాల్గొన్నారు.
రైతుల కోసం కేంద్రం దిగిరావాలి
చెన్నారావుపేట/నెక్కొండ/నల్లబెల్లి: రైతుల కోసం కేంద్రం దిగిరావాలని చెన్నారావుపేట ఎంపీపీ బదావత్ విజేందర్ డిమాండ్ చేశారు. ఈజీఎస్‌కు వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉత్తర యుద్ధం కార్యక్రమాన్ని ఎంపీపీ ఎల్లాయగూడెంలో ప్రారంభించారు. సర్పంచ్‌లు జయా జనార్దన్, బోడ విజయా బద్దూనాయక్, బోడ ఆనంద్, శారదా గణేశ్, ఉప సర్పంచ్ విజయ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సాంబయ్య, రాజారాం, రాజన్న, మురళీనాయక్ పాల్గొన్నారు. నెక్కొండ మండలంలోని అప్పల్రావుపేట, వెంకటాపురం, తోపనపల్లి, అలంకానిపేటలో ఎంపీపీ జాటోత్ రమేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్ బీఆర్ఎస్ శ్రేణులు, ఉపాధిహామీ కూలీలతో కలిసి ఉత్తరాలను కేంద్రమంత్రికి పోస్టు చేశారు. అలంకానిపేట సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీ రవి, నాయకులు సూరం రాజిరెడ్డి, దొనికెన సారంగపాణి, బొల్లెబోయిన వీరస్వామి, బంజరుపల్లి సర్పంచ్ స్వరూప రవి, ఉప సర్పంచ్ గుంటుక నర్సయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చీకటి శ్రీనివాస్, యాసం బాలకృష్ణ, బోళ్ల భూపాల్, రామారావు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే ఉధృతం
నల్లబెల్లి: ఉపాధిహామీ కూలీల సమస్యలు పరిష్కరించకుంటే ఉత్తర యుద్ధాన్ని ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు మండలంలో ఐదో రోజు పోస్టుకార్డు ఉద్యమం కొనసాగింది. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని జీపీ కార్యాలయ ఆవరణలో ఉత్తర యుద్ధం కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం ఈజీఎస్‌కు రూ. 30 వేల కోట్లు తగ్గించడం, 100 రోజుల పనిదినాలను కుదించడం, ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తున్న కూలీకి రోజుకు రూ. 480 చెల్లించాల్సి ఉండగా.. రూ. 257 ఇవ్వాలని ప్రకటించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రవీణ్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నానెబోయిన రాజారాం, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, ఎంపీటీసీ జన్ను జయరావు, నాయకులు గందె శ్రీనివాస్‌గుప్తా, ఇంగ్లె శివాజీ, గోనెల నరహరి, మాలోత్ ప్రతాప్‌సింగ్, శ్రీనివాస్, సుభాష్ పాల్గొన్నారు.