తరిగొప్పుల, ఏప్రిల్ 6: రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రా ష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సోమవారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అబ్దుల్‌నాగారంలో రైతు ల సమస్యలు తెలుసుకున్న ఆయనఅక్కడి నుంచే మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు.
తరిగొప్పులలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా ఆయన సానూకులంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చే వరకు రైతులు, మహిళలు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాడుతామన్నారు.
ఆయన వెంట తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అర్జుల సంపత్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పింగిళి జగన్మ్హన్రెడ్డి, అధికార ప్రతినిధి చిలివేరు లింగం, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుర్ర మల్లయ్య, సర్పంచ్‌లు భూక్యా రవి, దండెం శ్రీనివాస్, బైకాని రమా బాలరాజ్యాదవ్, మంచినీళ్ల రాజు, నాయకులు ఏడెల్లి శ్రీనివాస్‌రెడ్డి, భూక్యా జూంలాల్‌నాయక్, తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్, బత్తిని సురేందర్, అంకం శ్రీనివాస్, యూత్ మండలాధ్యక్షుడు మల్యాల సుధీర్, థామస్, నీల సంపత్, జైపాల్ ఉన్నారు.