వరంగల్, ఆగస్టు 22(నమస్తేతెలంగాణ) : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆ ర్ను మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన లో తనకు మరోసారి అవకాశం ఇవ్వడంపై నరేందర్ కృతజ్ఞతలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందరంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే నరేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఆశీర్వాదం, పార్టీ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ప్రజా సేవలో ముందుంటానని నన్నపునేని పేర్కొన్నారు.
మరోమారు తమ ఓటుతో నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జిల్లా మంత్రులు, మేయర్, చైర్మన్, అండగా నిలిచిన వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో మంత్రి సత్యవతిరాథోడ్‌ను కూడా ఆయన కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మెల్యే నన్నపునేనికి శుభాకాంక్షలు తెలిపారు.