కరీమాబాద్, అక్టోబర్ 26: గుడిసెవాసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జక్కలొద్ది గుడిసెకాలనీలోని మూడు వేల కుటుంబాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కాంగ్రెస్ నాయకుల కుటిల రాజకీయాలు ప్రజలకు తెలుసునన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
గిర్మాజీపేట : ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీఆర్ఎస్ సర్కారు వెంటే మేమంతా ఉంటామని, వచ్చే ఎన్నికల్లో నన్నపునేని నరేందర్‌కే తమ పూర్తి మద్దతు ఉంటుందని ఓల్డ్ ఫర్నిచర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు వారు రాజశ్రీ గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నరేందర్‌ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఎన్నికల ఖర్చు కోసం 39వ డివిజన్‌కు చెందిన చిన్నారి జుబేరియా తాను దాచుకున్న రూ.5 వేలను ఎమ్మెల్యేకు అందించారు. దీంతో బాలికను ఆయన అభినందించారు. అలాగే, 21వ డివిజన్‌కు చెందిన బీజేపీ యూత్ నాయకుడు ఆవుల కమల్‌ను ఎమ్మెల్యే నరేందర్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ముష్కమల్ల సుధాకర్ పాల్గొన్నారు.