లింగాల ఘణపురం : ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలకు ఏ ఒక్కరికి ఎవ్వరు కూడా లంచం ఇవ్వొద్దని స్టేషన్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నెల్లుట్లలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని 370 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. పైరవీలకు తావుండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి పథకాలను అందించమన్నారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపాలన్నదే తన ధ్యేయమన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అదే సమయంలో నియోజవ ర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కడియం పేర్కొన్నారు. సమావేశంలో తాసిల్దార్ రవీందర్, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, విఎంసి వైస్ చైర్మన్ శివకుమార్, మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.