మడికొండ, డిసెంబర్ 18: పార్టీ బలోపేతానికి ప్రతి ఒకరూ కృషి చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. మడి కొండలోని ఓ ఫంక్షన్ హాల్లో ధర్మసాగర్, వేలేరు మండలాల బీఆర్ఎస్ శ్రేణుల విసృ్తతస్థాయి స మావేశం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా కడియం హాజరై మాట్లాడారు. శాసనసభ ఎన్నిక ల్లో ధర్మసాగర్, వేలేరు మండలాల్లో తకువ మె జార్టీ వచ్చిన బూత్‌లలో పార్టీని పటిష్టం చేసేందు కు చొరవ తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో తనకు సహకరించిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి కృత జ్ఞతలు తెలియజేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే సంసిద్ధం గా ఉండాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, ఇతర అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. సమావే శంలో కడియం ఫౌండేషన్ చైర్మన్ కావ్య, 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన, ధర్మసా గర్, వేలేరు జడ్పీటీసీలు డాక్టర్ పిట్టల శ్రీలత, చాడ సరితారెడ్డి, ఎంపీపీలు నిమ్మ కవి త, కేసిరెడ్డి సమ్మిరెడ్డి, డీసీసీ డైరెక్టర్ గుండ్రెడ్డి రా జేశ్వర్‌రెడ్డి, ధర్మసాగర్, వేలేరు మండల పార్టీ అధ్యక్షులు మునిగెల రాజు, మరిజె నర్సింగ్, కుడా డైరెక్టర్ బిల్ల యాదగిరి, సర్పంచుల ఫోరం మండల అధ్య క్షుడు కాగిత మాధవరెడ్డి, నాయకులు గుజ్జుల రామ్ గోపాల్‌రెడ్డి, విజయపురి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.