కాంగ్రెస్‌కు ఓటేస్తే కటిక చీకట్లే
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చి మ్మ చీకట్లే మిగులుతాయని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని కొప్పుల, వసంతాపూర్, గంగిరేణిగూడెం, సూర్యనాయక్‌తండా, కాట్రపల్లి, ప్రగతిసింగారం, పత్తిపాక, జోగంపల్లి, పెద్దకోడెపాక గ్రామాల్లో వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి పర్యటించారు.
- అసత్య ఆరోపణలు చేస్తే జైలుకే..
- కాంగ్రెస్ నేతపై పరువునష్టం దావా వేశా
- మరోసారీ భారీ మెజార్టీతో గెలుస్తా
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
- కాంగ్రెస్, బీజేపీలకు ప్రజాదరణ లేదు
- వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
శాయంపేట, నవంబర్ 25 : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చి మ్మ చీకట్లే మిగులుతాయని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని కొప్పుల, వసంతాపూర్, గంగిరేణిగూడెం, సూర్యనాయక్‌తండా, కాట్రపల్లి, ప్రగతిసింగారం, పత్తిపాక, జోగంపల్లి, పెద్దకోడెపాక గ్రామాల్లో వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి పర్యటించారు. మహిళలు కోలాటాలు, బతుకమ్మలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ జడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతిని గెలిపించారని, ఇద్దరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. తనపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత స్వభావం, స్థితిగతులు ఏందో ప్రజలకు తెలుసన్నారు. మంచి చేసే తనపై కాంగ్రెస్ నేత పదే పదే అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, ఓర్పు నశించి రూ. 2 కోట్లకు పరువు నష్టం దావా వేశానని, జైలు కు పోవడం ఖాయమన్నారు. మరోసారి తన గెలుపు నల్లేరుమీద నడకేనన్నారు.
దవాఖానల్లో ఏజెంట్లను పెట్టుకు ని తానేదో సేవ చేస్తున్నట్టు ఆ నాయకుడు నాటకాలాడుతున్నాడని మండిపడ్డారు. జీఎంఆర్ ట్రస్టుతో ఎంతో మంది యువకులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చి ఉపాధి కల్పించామన్నారు. వేంకటేశ్వరస్వామి గుడి కట్టిస్తే దోచుకున్నరు అని ఆరోపణలు చేస్తున్నాడని, భగవంతుడు, ప్రజల ఆశీర్వాదం తమపై ఉందన్నారు. వేంకటేశ్వరస్వామిపై అసత్య ప్రచారం చేస్తే అతడికి పెద్ద శాపమే తగులుతుందన్నారు. కారు గుర్తు కు ఓటేసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని, ప్రభుత్వం వచ్చా క అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా చేపడతామన్నారు. కొప్పుల నుంచి పరకాల మూలతాళ్ల వరకు రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందన్నారు. గంగిరేణిగూడెం నుం చి కొప్పుల వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. అర్హులైన వారికి అవసరమైన పథకాలు ఇప్పిస్తానని, తనను భారీ మెజార్టీతో గెలిపించాని గండ్ర కోరారు.
కాంగ్రెస్, బీజేపీలకు ప్రజాదరణ లేదు
– జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ఏ మాత్రం ప్రజాదరణ లేదని, ఆ పార్టీల సభలకు జనం లేక ఖాళీ కుర్చీలే ఉండటం నిదర్శనమని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అ న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌కు చి త్తశుద్ది లేదని, అధికారంలోకి వస్తే సీఎంల కోసం కొట్లాట జరగడం ఖాయమన్నారు. దీంతో అభివృద్ధి, సంక్షేమం ఆగిపోతుందన్నారు. కేసీఆర్‌తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఎంతసేపు అబద్దాలతో మభ్యపెడుతున్న నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలన్నారు. ఐదేళ్లుగా ప్రజల మధ్యనే ఉంటున్నామని మరోసారి గండ్ర వెంకటరమణారెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలన్నారు. కొ ప్పులతో పాటు పలు గ్రామాల్లో యువకులు, వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే గండ్ర, జడ్పీ చైర్పర్సన్ వారిని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతు కు తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రాంశెట్టిలతాలక్ష్మారెడ్డి, ఏఎం సీ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, పార్టీ మండలాధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌లు గోలి మాధురీమహేందర్రెడ్డి, భూక్యా రమేశ్, పోతు సుమలత, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీటీసీలు మేకల శ్రీనివాస్, వావిలాల వేణు, మా చర్ల మంగమ్మ, అజ్మీరా ఉమారఘుసింగ్, వంగాల నారాయణరెడ్డి, సుమన్, మధుసూదన్, రవీందర్, భాస్కర్, రవీందర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

