మోరంచపల్లి గ్రామ పరిస్థితిని అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన సుమారు 900 మందిని గణపురం మండలం కర్కపల్లి పాఠశాల, గాంధీనగర్‌లోకి సీఎస్ఐ పాఠశాలకు తరలించారు.
ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించారు. అలాగే ప్రభుత్వం రెండు హెలికాప్టర్లను పంపించింది. ప్రాణ, ఆస్తి నష్టం పెరుగకుండా కాపాడారు. బాధితులకు ప్రభుత్వం, ఎమ్మెల్యే గండ్ర ఆర్థిక సాయం అందజేశారు. స్వచ్ఛంద సంస్థలు చేయూతనందించాయి.