దుగ్గొండి, ఏప్రిల్, 18: ప్రభుత్వం అందించే మద్దతు ధరను ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మందపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని రైతులకు సూచించారు.
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలవాయి శ్రీనివాస్, ఏవో మాధవి, తహసీల్దార్ రవిచంద్రా రెడ్డి, ఇతర అధికారులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.