వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంగెం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వెంకటాపూర్ గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా వేసిన సీసీ రోడ్ల ప్రారంభం, రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ, రూ.20 లక్షలతో మహిళ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామసభలోఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ఏదో విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.