సంగెం, ఆగస్టు 30: సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పరకా ల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని పల్లార్గూడ, మొండ్రాయి, ముమ్మడివరం, నార్లవాయి, నల్లబెల్లిలో బుధవారం రైతులకు పంట నష్టపరిహారం చెక్కుల పంపిణీ, గొల్లపల్లిలో రూ.20లక్షలతో జీపీ భవనానికి ఎమ్మెల్యే చల్లా శంకుస్థాపన చేశారు. మొండ్రాయిలో నిర్మించిన సీసీరోడ్లను ప్రారంభించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన 2,363 మంది రైతులకు రూ.2కోట్ల 6లక్షల 36వేల విలువైన చెక్కులను అందించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో 7,187 ఎకరాల్లో దెబ్బతినగా 7,482 మంది రైతులకు రూ.7కోట్ల 18లక్షల 77వేల 750 పరిహారం అందిస్తున్నట్టు తెలిపారు.గ్రామాల్లోకి వచ్చి మాయ మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలన్నారు.
రూ.33కోట్లతో మచ్చాపూర్- వయా మొండ్రాయి మీదుగా చెన్నారావుపేట వరకు డబుల్‌రోడ్డు మంజూరైందని, రెండు నెలల్లోనే పూర్తవుతుందన్నారు. మొండ్రాయిలో డ్రైనేజీ మంజూరు చేసినట్టు చెప్పారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. మనసున్న సీఎం కేసీఆర్ పది కాలాల పాటు ఉంటేనే ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలవుతాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. పలు గ్రామాల ప్రజలు, రైతులు శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించారు. నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, కందకట్ల నరహరి, బుక్క మల్లయ్య, పసునూరి సారంగపాణి, సర్పంచ్‌లు కక్కెర్ల కుమారస్వామి, మేరుగు మల్లేశం, గూడ కుమారస్వామి, పెంతల స్రవంతి, బిచ్చానాయక్, ఇజ్జగిరి స్వప్నా అశోక్, కోడూరి రజితా రమేశ్, ఎంపీటీసీలు గుగులోత్ వీరమ్మ, కొనకటి రాణీ మొగిలి, కట్ల సుమలతా నరేశ్, కోఆప్షన్ మన్సూర్ అలి, ఏవో యాకయ్య, ఏఈఓలు రాజేందర్, సాగర్, సుమలత, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ రమేశ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.