పరకాల, ఆగస్టు 19 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.1.98కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకుల నిర్లక్ష్యంతో వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వచ్చేదన్నారు. రైతులు మార్కెట్‌కు వస్తే గిట్టుబాటు ధర లేక, పంట దాచుకుందామంటే గిడ్డంగులు లేక ఇబ్బందులు పడేవారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారని, ఆయన పాలనలో మార్కెట్ యార్డుల్లో సౌలతులు మెరుగయ్యాయని అన్నా రు. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ దేశానికే మార్గదర్శకుడిలా మారారన్నారు.
వ్యవసాయ మార్కెట్ యార్డుల ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్లో రూ.84లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించినట్లు తెలిపారు. అలాగే, రూ.15లక్షలతో టాయిలెట్స్, రూ.26 లక్షలతో 40వేల లీటర్ల సామర్థ్యం గల ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్, రూ.73లక్షలతో మార్కెట్ చుట్టూ ప్రహరీ నిర్మించినట్లు తెలిపారు. మార్కెట్ ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని గదులను స్థానిక ప్రజలకే ఇస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారు ఏఎంసీ చైర్మన్‌ను కలువాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, జడ్పీటీసీ సిలివేరు మొగిలి, నడికూడ ఎంపీపీ మచ్చ అనసూర్య, జడ్పీటీసీ కోడెపాక సుమలత, పీఏసీఎస్ చైర్మన్లు గుండెబోయిన నాగయ్య, నల్లెల్ల లింగమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన 200 యాదవ కుటుంబాలు
గీసుగొండ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి అనేక పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గొర్రెకుంట గ్రామంలోని 200 యాదవ కుటుంబాలు శనివారం ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఉంటే నేరుగా తన వద్దకే రావాలని ఎమ్మెల్యే సూచించారు. యాదవులకు సీఎం కేసీఆర్ పెద్దన్నలాగా గొర్రెలు పంపిణీ చేశారన్నారు. గృహలక్ష్మి పథకంలో అర్హులైన యాదవులకు ఇండ్లు ఇస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో యాదవ సంఘం గ్రామ అధ్యక్షుడు పెరబోయిన రాజు, నాయకులు మ్యాదరబోయిన వెంకటేశ్వర్లు, రవి, సమ్మయ్య, బాబు, కొమురెల్లి, మల్లేశం, శ్రీనుతోపాటు 200 కుటుంబాల సభ్యులు ఉన్నారు.
కార్యక్రమంలో 15, 17 డివిజన్ల కార్పొరేటర్లు ఆకులపల్లి మనోహర్, గద్దె బాబు, గీసుగొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సొసైటీ వైస్ చైర్మన్ కందుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ ల్యాదెల్ల బాలయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, నాయకులు లవ్రాజు, నర్స య్య, గజ్జి రాజు, నవీన్, విజయ్, నాయకులు యుగేంధర్, మల్లేశం, సాంబయ్య, అఖిల్, చేరాలు, భిక్షపతి పాల్గొన్నారు. కాగా, అంతకు ముందు 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామం నుంచి పోతురాజుపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న వారి వద్దకు వెళ్లి వారితో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడారు. ఇండ్లు కోల్పోతున్న కుటుంబాలకు గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మం జూరు చేస్తానని తెలిపారు. ఈ మేరకు అర్హుల వివరాలను అధికారులు సేకరించారని వారికి మంజూరు చేస్తానని తెలిపారు. ఇండ్ల స్థలం కోల్పోతున్న వారికి కూడా స్థలా లు ఇస్తామన్నారు. రోడ్డు వెడల్పుతో గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. శ్మశానవాటిక నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో పద్మశాలి, ఎస్సీ కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు భూమి కేటాయించామని చెప్పారు. మహిళల కోరిక మేరకు గ్రామంలో బతుకమ్మ బండ్‌తో పాటు బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అర్హలైన వారందరికీ సంక్షేమ ఫలాలు వస్తామని ఎవరూ తొందరపడవద్దని సూచించారు.