కాంగ్రెస్ వస్తే చిమ్మచీకట్లు
తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ ప్రజలను కోరారు. గ్రేటర్ 1, 2, 55 డివిజన్ల పరిధిలోని గుండ్ల సింగారం, పెగడపల్లి, ముచ్చర్ల, పలివేల్పుల, ఎర్రగట్టుగుట్ట కాలనీ, భీమారం గ్రామాల్లో అరూరి శుక్రవారం ఇంటింటా ప్రచారం చేశారు.
- ఆ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మొద్దు
- మీ బిడ్డగా ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా..
- ఎమ్మెల్యే అరూరి రమేశ్
- హసన్‌పర్తి మండలంలో ఎన్నికల ప్రచారం
- అరూరికి వాల్మీకిబోయ, ఎస్సీ కాలనీ ప్రజల మద్దతు
హసన్‌పర్తి, నవంబర్ 17: తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ ప్రజలను కోరారు. గ్రేటర్ 1, 2, 55 డివిజన్ల పరిధిలోని గుండ్ల సింగారం, పెగడపల్లి, ముచ్చర్ల, పలివేల్పుల, ఎర్రగట్టుగుట్ట కాలనీ, భీమారం గ్రామాల్లో అరూరి శుక్రవారం ఇంటింటా ప్రచారం చేశారు. మహిళలు, పార్టీ శ్రేణులు కోలాటాలు, డప్పు చప్పుళ్లు, బతుకమ్మలు, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో పది మంది నాయకులు సీఎం అభ్యర్థులేనని ఎద్దేవా చేశారు. భవన్లో తగాదాలతో కాలం వెళ్లదీస్తున్నారే తప్పా ప్రజలకు ఏం చెప్పాలో క్లారిటీ వారికి లేదన్నారు. వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణను చిమ్మచీకట్లు చేస్తారని అన్నారు. డబ్బులు పెట్టి వర్ధన్నపేట టికెట్‌ను కొనుక్కున్న కాంగ్రెస్ వారు ప్రజలకు సేవా చేస్తారా అని అన్నారు.
వర్ధన్నపేటను అన్ని రంగాలల్లో రూ.4,354కోట్లతో అభివృద్ధి చేయడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మేయర్ గుండు సుధారాణి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసిన అరూరిని ప్రజలు మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. పెగడపెల్లికి చెందిన వాల్మీకి బోయ సంఘం నాయకులు, ఎస్సీ కాలనీ ప్రజలు అరూరికి మద్దతు ప్రకటించారు. కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, జిల్లా రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ లలితాయాదవ్, రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి, కార్పొరేటర్లు జక్కుల రజితా వెంకటేశ్వర్లు, లావుడ్య రవినాయక్, డివిజన్ అధ్యక్షులు నరెడ్ల శ్రీధర్, అటికం రవీందర్, మార్కెట్ డైరెక్టర్, ఆత్మ డైరెక్టర్ గనిపాక కల్పణా విజయ్,గ్రామ అధ్యక్షులు కుమార్‌యాదవ్, పోతరబోయిన లోకేశ్‌యాదవ్, రాయికంటి సురేశ్, మూల దేవేందర్, నంది శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్, ఎర్రగట్టు గుట్ట ఆలయ చైర్మన్ లక్ష్మణ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు సుధాకర్, జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, గోవర్ధన్ పాల్గొన్నారు.
‘అరూరి’కి ముదిరాజ్ కులస్తుల మద్దతు
నయీంనగర్: గ్రేటర్ వరంగల్ 43, 44వ డివిజన్ తిమ్మాపూర్ గ్రామ ముదిరాజ్ కులస్తులు బీఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ శుక్రవారం హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాస ఆవరణలో మర్యాద పూర్వకంగా కలిశారు. అధ్యక్షుడు మేకల కుమారస్వామి, వల్లాల రాములు, సూరయ్య, ఐలయ్య, కుమారస్వామి, కృష్ణ, రాములు, శంకర్, ఎల్లయ్య, సారయ్య, శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

