వరంగల్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణకు కొండంత పండుగ బతుకమ్మ. ఆకాశమంత ఆర్భాటమైన ఏర్పాట్లు చేసుకునే పండుగ దసరా. తమ పిల్లలకు కొత్తబట్టలు కుట్టించాలని తల్లిదండ్రులు తలపోస్తరు. తమకు కొత్త బట్టలు వస్తయని పిల్లలూ ఆశగా ఎదురుచూస్తరు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పుణ్యమా అని అటు తల్లిదండ్రుల, ఇటు పిల్లల గంపెడు ఆత్రుత, ఆశలు గంగల కలిశాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.
పెద్ద పెద్ద ఉద్యోగులకు తిప్పల్లే దు కానీ, ఎటొచ్చీ తమ బతుకులే ఆగమైపోతున్నాయని చిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇంటింటీకీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయటంలో క్షేత్రస్థాయిలో పనిచేసే కీలకపాత్ర పోషించే మిషన్ భగీరథ సిబ్బంది నాలుగు నెలలుగా జీతాలు రాక పండుగ పూట వేతనాల కోసం ఎదురుచూస్తు న్నారు. ఇక పండుగపూట పల్లెలను తమ సొంత ఇంటిలా శుభ్రం చేసే పంచాయతీ కార్మికులు జీతం రాక ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలోని కార్మికులు, సిబ్బంది కాంగ్రెస్ సర్కారుపై నిరసన జెండాలు ఎత్తారు. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క నియోజకవర్గంలో మిషన్ భగీరథ సిబ్బంది ఆవేదన భరితమవుతున్నా రు. నాలుగు నెలలుగా జీతాలు రాకపోతే ఎలా అని ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. పలుమార్లు వేతనాలు చెల్లించాలని మంత్రికి కలిసి నివేదించినా, అనేక సార్లు కలిసి వేడుకున్నా ప్రయోజనం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుందని మిషన్ భగీరథ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండ లంలోని పాలంపేటలో తాగునీటి సరఫరా చేసే లైన్ బంద్ చేయడమే కాకుండా గేట్‌కు తాళం వేసి ధర్నా చేశారు. మరోవైపు ఏటూరునాగారం అంబేదర్ విగ్రహం ముందు చుట్టుపక్కల నాలుగు మండలాల్లో నిరాహార దీక్ష చేపట్టారు. పండుగ సమయంలో నిరసన తమకూ బాధకరమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పటంలేదని, ఇంతకన్నా తమకు గత్యంతరం లేదని వారు పేర్కొనడం గమ నార్హం. అలాగే పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని, ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డులు జారీ చేయా లని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పల్లెలను అద్దంలా మెరిసే లా పాటుపడే పంచాయతీ సి బ్బందికి కాంగ్రెస్ సర్కార్ మూ డునెలలుగా వేతనాలు బాకీ పడిం ది. ‘మొన్న వినాయక చవితి పండుగకు పస్తులున్నాం..ఇప్పుడు దసరా పండుగ కూ పస్తులు ఉండాల్సిందేనా?’ అని గ్రామ పంచాయతీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. హనుమకొండ లోని ఏకశిలా పార్కు వద్ద ధర్నా నిర్వహించి అక్కడి నుంచి వరంగల్ కలెక్టరేట్ దాకా ర్యాలీ నిర్వహించారు. వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.