లింగాలఘనపురం, సెప్టెంబర్ 29 : రెండేళ్లలో గీత కార్మికులకు రక్షణ కిట్లు ఇస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురం లో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గీత వృత్తిని నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయన్నా రు.
వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే కాటమయ్య సేఫ్టీకిట్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. జనగామ జిల్లాకు సర్వాయిపాపన్న పేరు పెట్టేలా సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తానన్నారు. రాష్ట్రంలోని గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్‌గ్రేషియా, బకాయిలను త్వరలో చెల్లిస్తామని పొన్నం తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు.