హనుమకొండ చౌరస్తా, మే 5: జీడబ్ల్యూఎంసీ ద్వారా రూపొందించిన ప్రగతి నివేదికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ వినయ్‌భాసర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి శుక్రవారం ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్ ఆవరణలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిషరించారు.
వరంగల్ మహానగర పాలక సంస్థ ద్వారా 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు నగరంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు పొందుపరిచి అద్భుతంగా రూపొందించారని కేటీఆర్ కితాబిచ్చారు. గతేడాది చేసిన అభివృద్ధి పనుల వివరాలు చిత్రాలతో సహా అద్భుతంగా నివేదికలో పొందుపరిచినట్లు వివరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ రవీందర్‌యాదవ్, అనిస్ ఉర్ రషీద్ తదితరులు ఉన్నారు.