ప్లాస్టిక్‌ను నియంత్రించాలి
భావితరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మనందరి బాధ్యతని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
- మంత్రి కొండా సురేఖ
వరంగల్, జనవరి 12 (నమస్తేతెలంగాణ): భావితరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మనందరి బాధ్యతని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నదని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపును విధిగా చేపట్టాలని సురేఖ పిలుపునిచ్చారు. తన సెక్రటేరియేట్ కార్యాలయంతోపాటు నివాసంలోనూ వీలైనంతగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు నిర్ణయించామని తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్‌కు బదులు గ్లాస్ బాటిళ్లు, లేదంటే స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచాలని మంత్రి సురేఖ సూచించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

