వరంగల్ చౌరస్తా : నిత్యం వివాదాల్లో ఉండే అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరో మారు వివాదాస్పదంగా మారాయి. రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరంగల్ కృష్ణ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల) భవన నిర్మాణానికి బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాధారణంగా మంత్రులు నూతనంగా ఏర్పాటు చేస్తున్న వివిధ కంపెనీలకు క్లియరెన్సులు, అనుమతులు మంజూరు చేయడం కోసం నగదు తీసుకుంటారన్నారు.
మా నియోజకవర్గంలో మాత్రం మేము అనుమతులు పొందే సంస్థతో మాట్లాడి చిరకాలం పేరు నిలబడే విధంగా భవన నిర్మాణానికి ఒప్పించడం జరిగిందని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంత్రి వ్యాఖ్యలుపై సొంత పార్టీ నాయకులే సెటైర్లు వేసుకోవడంతో ఒక్క కంపెనీకి అనుమతులు ఇస్తున్నందుకే ఈ స్థాయిలో తీసుకుంటే అధికారం ఉన్నన్ని రోజులు ఎంత నొక్కేసుంటారని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.