రాయపర్తి, మే 20: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని కేశవాపురంలో అంబేద్కర్ యువజన సంఘం నేతృత్వంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత సర్పంచ్ చిలముల్ల ఎల్లమ్మ యాకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తున్నట్లు తెలిపారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులకు అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ఫలాలతోపాటు అన్ని రంగాల్లో అద్భుత అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించారన్నారు. అనంతరం మంత్రిని అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పొలిటికల్ జేఏసీ ప్రతినిధి కత్తి వెంకటస్వామిగౌడ్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, తొర్రూరు జడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, మండల నాయకులు పూస మధు, మొలుగూరి పున్నమయ్య, జలగం మల్లయ్య, ముత్తడి సాగర్‌రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు చిలుముల్ల శ్రీనివాస్, రమేశ్, కృష్ణ, తూళ్ల ప్రవీణ్‌కుమార్, రాజు, జలగం ప్రశాంత్, శ్రీకాంత్, వేల్పుగొండ రంజిత్‌కుమార్, తూళ్ల నిరంజన్, చిలుముల్ల శేఖర్, తూళ్ల శేఖర్ పాల్గొన్నారు.