Minister Errabelli | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనములచే శ్రీ సీతారామాంజనేయ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. పునః ప్రతిష్టాపకు ఏర్పాట్లు చేసిన అధికారులు, కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కలెక్టర్ శివలింగయ్య అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఇతర జిల్లా స్థాయి అధికారులను ఘనంగా సన్మానించారు.
కాగా, వల్మిడి ఆలయ నిర్మాణ ఏర్పాట్లకు గుడి బయట నుంచి పరిశీలిస్తున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి.. సోషల్మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కొంతమంది దుర్మార్గులు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.